
కరోనా భారిన పడ్డ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఒక వీడియోను రిలీజ్ చేసారు. నేను ఆసుపత్రిలో చేరేటప్పుడు కాస్త అనారోగ్యాంగా ఉన్నప్పటికీ ఇప్పుడు బాగానే వున్నానని త్వరలోనే కోలుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశారు ట్రంప్. కరోనా చికిత్సలో రెండు, మూడు రోజులు కీలకం కానున్నాయి. ఆయన ‘వర్క్ ఫ్రమ్ హాస్పిటల్’ చేసేందుకు వీలుగా వైట్ హౌస్‌లోని స్పెషల్ సూట్ రూమ్‌ను ‘అధ్యక్ష కార్యాలయం’గా మార్చేశారు.