Donald Trump Macron Wife: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ముఖాన్ని ఆయన సతీమణి బ్రిగెట్టా నెట్టినట్టుగా ఉన్న వీడియో ఇటీవల వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అలాంటి జరగేటప్పుడు తలుపులు వేసి ఉన్నాయో, లేదో చూసుకోవాలన్నారు. ఓవల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఇటీవల వైరల్ అయిన వీడియో పై స్పందిచాలని ఓ విలేకరి ట్రంప్ ను కోరారు.