
తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ పొడిగించవద్దని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో నేటితో లాక్ డౌన్ ముగియనున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్, వానాకాలం సాగు పై తెలంగాణ మంత్రి వర్గం సమావేశమై చర్చిస్తోంది. ఈ నేపథ్యంలో ఎంపీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. లాక్ డౌన్ పై నా వ్యతిరేకతను మరోమారు స్పష్టం చేస్తున్నాను. కొవిడ్ ఎదుర్కొనేందుకు లాక్ డౌన్ పరిష్కారం కాదు. దీంతో పేదల జీవితాలు నాశనమవుతాయి అని అన్నారు.