Most Expensive Diwali Sweet : హిందువుల ప్రత్యేక పండుగ దీపావళి 2025 అక్టోబర్ 20న రాబోతుంది. ఈ సందర్భంగా దీపావళి పర్వదిన వేడుకలను జరుపుకునేందుకు దేశవ్యాప్తంగా సిద్ధమవుతున్నారు. దీపావళి అనగానే ఇంటిని దీపాలతో అలంకరించడం.. వ్యాపార సముదాయంలో లక్ష్మీ పూజలు చేయడం.. టపాసులు కాల్చడం వంటివి గుర్తుకు వస్తాయి. అయితే దీపావళి రోజున ప్రత్యేకంగా స్వీట్స్ కూడా పంచుతూ ఉంటారు. దీపావళి పండుగ రాబోతున్న సమయంలో రకరకాల స్వీట్లు మార్కెట్లోకి వస్తుంటాయి. ఇప్పటికే మార్కెట్లోకి కొత్త కొత్త స్వీట్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ ఏడాది దీపావళికి లక్ష రూపాయల స్వీట్ అందుబాటులోకి వచ్చింది. ఆ స్వీట్ గురించి తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వివరాల్లోకి వెళ్ళండి.
దీపావళి పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటారు. ఈ సందర్భంగా స్వీట్స్ కొనుగోలు ఎక్కువగా ఉంటాయి. అయితే రాజస్థాన్లోని జైపూర్లో తాజాగా ఒక కిలో స్వీట్ ను అందుబాటులో ఉంచారు. ఈ స్వీట్ ధర అక్షరాల రూ.1,11,000. అయితే ఈ స్వీట్ లో బంగారం కూడా ఉంటుంది. దీనికి స్వర్ణ ప్రసాదం అని పేరు పెట్టారు. దీనిని తినడం వల్ల ఆరోగ్యానికి మేలు ఉంటుందని చెబుతున్నారు. ఈ మిఠాయి తయారీలో అత్యంత ఖరీదైన ఆయుర్వేద పదార్థాలు వాడారు. వాటిలో స్వర్ణ భస్మం, కుంకుమపువ్వు, ఫైన్ గింజలు ఉపయోగించారు. దీనిని తినడం . అలాగే దీనిని కొనుగోలు చేసిన వారికి బంగారు పూతతో కూడిన పళ్ళెంలో పెట్టి ఇస్తున్నారు.
స్వర్ణ ప్రసాదం అనే స్వీట్ మాత్రమే కాకుండా మరికొన్ని ఖరీదైన స్వీట్లు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. స్వర్ణ భస్మ ఒకటి. దీని ఖరీదు రూ.85,000. అలాగే చాంది భస్మ రూ.58,000. దీనిని వెండితో తయారు చేశారు. దీపావళి సందర్భంగా కొందరు ప్రత్యేకంగా బహుమతులు అందిస్తారు. ఈ బహుమతులతో పాటు ప్రత్యేకమైన లేదా అధిక ధర కలిగిన స్వీట్ ఇవ్వడం వల్ల ఎదుటివారి మనసును దోచుకోవచ్చని భావిస్తారు. అలాంటి వారి కోసం ఈ స్వీట్ ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు. అంతేకాకుండా ఈ స్వీట్లు ఆరోగ్యకరమైనవి కూడా కావడంతో వీటి కొనుగోలు వల్ల ఎలాంటి నష్టం ఉండదని అంటున్నారు.
అయితే ప్రస్తుతం ఇది రాజస్థాన్ లోని జైపూర్ లో అందుబాటులో ఉంది. మరి దీనిని దేశవ్యాప్తంగా విక్రయిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. కానీ దీపావళి పండుగ సందర్భంగా మార్కెట్లోకి కొత్త రకాల స్వీట్లు అందుబాటులోకి వస్తాయి. దీపావళి రోజున లక్ష్మీ పూజ ఉంటుంది. ఈరోజు సాయంత్రం లక్ష్మీ పూజ తర్వాత స్వీట్లు పంచుకుంటూ ఉంటారు. అతిథులు, స్నేహితులు, బంధువుల మధ్య జరుపుకున్న ఈ పూజ తర్వాత స్వీట్స్ పంచడం వల్ల వారు ఎంతో సంతోషంగా ఉండగలుగుతారు.