
అమెరికా టెన్నిస్ తార సెరెనా విలియమ్స్ తీవ్ర భావోద్వేగానికి గురైంది. అభిమానుల సమక్షంలో కన్నీరు పెట్టుకుంది. తన చిరకాల స్వప్నం మరింత ఆలస్యం కావడమే ఇందుకు కారణం. గాయం కారణంగా ఆమె వింబుల్డన్ నుంచి తొలి రౌండ్లోనే తప్పుకుంది. ఆధునిక టెన్నిస్ లో అత్యధిక గ్రాండ్ స్లామ్ లు కైవసం చేసుకున్న క్రీడాకారిణి సెరెనా విలియమ్సే,. అయితే ఆల్ టైం అత్యధిక గ్రాండ్ స్టామ్ ల రికార్టు మార్గరెట్ కోర్ట్ పేరుతో ఉంది. ఆమె 24 గెలిచింది.