Deputy CM Pawan Kalyan: ప్రతినెలా 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. రోజుకు రెండు పూటలు చౌక దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ చేస్తామని అన్నారు. గత ప్రభుత్వం ఇంటింటికి సరుకులు అందిస్తామని ప్రజలను ఎంతో ఇబ్బంది పెట్టిందని అన్నారు. రేషన్ బియ్యం, సరుకులు అక్రమంగా తరలిస్తున్న విషయంపై కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపిందని అన్నారు.