
ఒలింపిక్స్ మూడో రోజు కూడా ఆర్చర్లు నిరాశ పరిచారు. ఇండియన్ మెన్స్ టీమ్ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. సౌత్ కొరియాతో జరిగిన ఈ గేమ్ లో భారత పురుషుల జట్టు 0-6 తో పరాజయం పాలైంది. తొలి సెట్ నుంచే కొరయన్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. అతాను దాస్, ప్రవీణ్ జాదావ్, తరుణ్ దీప్ రాయ్ లతో కూడిన టీమ్ తొలి సెట్ లో 54, రెండో సెట్ లో 57, మూడో సెట్ లో 54 స్కోర్ చేసింది. మరో వైపు కొరియన్లు తొలి సెట్ లో 59, రెండో సెట్ లో 59, మూడో సెట్ లో 56 స్కోర్ చేశారు. దీంతో మొత్తం ఆరు పాయంట్లు సౌత్ కొరియా టీమ్ ఖతాలోకి వెళ్లాయి.