https://oktelugu.com/

అలా చేయడం ఇష్టం లేదు: నిధి అగర్వాల్

బోల్డ్ భామ ‘నిధి అగర్వాల్’కి చిన్న సినిమాల్లోనే అవకాశాలు ఇవ్వడానికి ఆలోచిస్తుంటే.. ఈమెగారు మాత్రం అడ్డమైన కండిషన్స్ పెడుతుంది. తనకు వాన పాటల్లో నటించడం అసలు ఇష్టం లేదని, అలాగే ఉదయమే ఏడుపు గొట్టు సీన్స్ లో నటించడం ఇష్టం లేదని చెబుతుంది నిధి. అసలు ఛాన్స్ ఇవ్వడానికే మేకర్స్ ఆలోచిస్తుంటే.. ఇలాంటి మాటలు చెప్పి వచ్చే ఆ అరకొర అవకాశాలను కూడా దూరం చేసుకోవడం అవసరమా ? అయినా లిప్ కిస్ ల్లో కూడా ఎలాంటి […]

Written By:
  • admin
  • , Updated On : July 26, 2021 / 11:16 AM IST
    Follow us on

    Nidhi Agarwal rain songsబోల్డ్ భామ ‘నిధి అగర్వాల్’కి చిన్న సినిమాల్లోనే అవకాశాలు ఇవ్వడానికి ఆలోచిస్తుంటే.. ఈమెగారు మాత్రం అడ్డమైన కండిషన్స్ పెడుతుంది. తనకు వాన పాటల్లో నటించడం అసలు ఇష్టం లేదని, అలాగే ఉదయమే ఏడుపు గొట్టు సీన్స్ లో నటించడం ఇష్టం లేదని చెబుతుంది నిధి. అసలు ఛాన్స్ ఇవ్వడానికే మేకర్స్ ఆలోచిస్తుంటే.. ఇలాంటి మాటలు చెప్పి వచ్చే ఆ అరకొర అవకాశాలను కూడా దూరం చేసుకోవడం అవసరమా ?

    అయినా లిప్ కిస్ ల్లో కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా, ఇష్టంగా నటించే ఈ బోల్డ్ భామ, వాన పాటల్లో నటించను, పరిధి దాటను లాంటి మాటలు ఎలా చెప్పడానికి మనసు వస్తోందో ? ఇంతకీ వాన పాటలు ఎందుకు ఇష్టం లేదు అంటే.. తనకు చాలా చికాకు అంటోంది. వానల్లో తడవడం, మళ్ళీ బట్టలు ఆరబెట్టుకోవడం, మళ్ళీ తడవడం లాంటివి చాలా చిరాగ్గా ఉంటుందట.

    అయినా మేకర్స్ వాన పాటలు ఎందుకు షూటింగ్ పెట్టుకుంటారో తనకు తెలుసు అని, కేవలం బోల్డ్ ఫోజులు కోసం, అలాగే పరిధి మించే ఎక్స్ పోజింగ్ కోసమేనని, అయినా వాన పాట లేకపోయినా అలాంటి ఫోజులు నేను ఇవ్వగలను అని చెబుతుంది నిధి. అవున్లే.. ఎక్స్ పోజింగ్ విషయంలో నిధిని మించిన హీరోయినే లేదు. ఆ రేంజ్ లో ఈ ఇస్మార్ట్ బ్యూటీ రెచ్చిపోతూ ఉంటుంది.

    ఇక నిధి అగర్వాల్ ప్రస్తుతం తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘హరి హర వీరమల్లు’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. నిధి జీవితంలో పెద్ద సినిమా ఇదే కావడం విశేషం. మరి ఈ సినిమాతోనైనా నిధికి కాలం కలిసి వస్తుందేమో చూడాలి.