
త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ లో పాల్గొననున్న భారత జట్టుకు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిని మెంటార్ గా నియమించడం పై మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ మాజీ సభ్యుడు సంజీవ్ గుప్తా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకే వ్యక్తి రెండు పదవుల్లో కొనసాగడం లోధా కమిటీ సంస్కరణలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ధోని ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సారథ్యం వహించిన విషయం తెలిసిందే.