Mrunal Thakur : గత రెండు రోజులు నుండి సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా లో ధనుష్(Dhanush) , మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) జంట వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14 న పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు ప్రచారం అయ్యాయి. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా సోషల్ మీడియా ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. ఈ రేంజ్ లో ప్రచారం అవుతున్నప్పటికీ కూడా ధనుష్, మృణాల్ ఠాకూర్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడం తో నిజంగానే వీళ్లిద్దరు వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతున్నారా? అనే సందేహాలు అభిమానుల్లో వ్యక్తం అయ్యాయి. అయితే ఈ వార్తలు మృణాల్ ఠాకూర్ వరకు చేరడం తో, ఆమె టీం సోషల్ మీడియా లో ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో ఫిబ్రవరి లో పెళ్లి అంటూ వస్తున్న వార్తలపై జనాలకు ఒక క్లారిటీ అయితే వచ్చింది కానీ, ఈ లేఖ మరి అనుమానాలకు తావు తీసింది.
మృణాల్ ఠాకూర్ టీం ఏమని చెప్పిందంటే ‘వచ్చే నెలలో మృణాల్ ఠాకూర్ పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియా లో విస్తృతంగా జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. ఎలాంటి కారణం లేకుండానే ఈ వార్త ప్రచారం లోకి రావడం మమ్మల్ని షాక్ కి గురి చేసింది. దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలను ఎవ్వరూ నమ్మకండి’ అంటూ చెప్పుకొచ్చారు. మృణాల్ టీం కేవలం వచ్చే నెలలో పెళ్లి లేదనే విషయం పై మాత్రమే స్పందించారు. అంతే కానీ ధనుష్ తో రిలేషన్ లో ఉన్న విషయంలో ఎలాంటి వాస్తవం లేదని మాత్రం బలంగా చెప్పలేకపోయింది మృణాల్ టీం. అసలు ఆ ప్రస్తావనే తీసుకొని రాలేదు. వచ్చే నెలలో వీళ్లిద్దరు పెళ్లి చేసుకోకపోవచ్చు, కానీ రాబోయే రోజుల్లో అయినా పెళ్లి చేసుకోవచ్చు కదా?, టీం విడుదల చేసిన లేఖని అలా కూడా అర్థం చేసుకోవచ్చు అని అంటున్నారు నెటిజెన్స్.
ఒకవేళ ధనుష్ తో ఎలాంటి రిలేషన్ లేకపోతే కుండా బద్దలు కొట్టినట్టు, మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదని కనీసం ఇప్పుడైనా స్పందించి ఉండేవారు. కానీ కేవలం వచ్చే నెలలో పెళ్లి అంటూ వస్తున్న వార్తల్లో మాత్రమే నిజం లేదని చెప్పకనే చెప్పుకొచ్చింది మూవీ టీం. కాబట్టి ఇప్పుడు కాకపోయినా, భవిష్యత్తులో అయినా ఈ జంట మూడు బంధం తో ఒకటి కాబోతుంది. ధనుష్ తన మాజీ భార్య ఐశ్వర్య(సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు) తో పూర్తి స్థాయిలో విడాకులు అందుకున్న సంగతి తెలిసిందే. ఆయన విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియా లో ఎన్నో రకాల రూమర్స్ వచ్చాయి. సీనియర్ హీరోయిన్ మీనా ని పెళ్లి చేసుకోబున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. అందులో ఎలాంటి నిజం లేదని మీనా చెప్పుకొచ్చింది. ఇప్పుడు మృణాల్ ఠాకూర్ తో రిలేషన్ విషయం పై రెండు వైపులా నుండి పిన్ డ్రాప్ సైలెన్స్ నడుస్తోంది, ఏమి జరగబోతుందో చూడాలి.
