
శ్రీశైలంలోని తలనీలాల కళ్యాణకట్ట వద్ద భక్తులు ధర్నాకు దిగారు. కళ్యాణకట్టను వెంటనే తెరిపించాలని నినాదాలు చేస్తూ భక్తులు అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ నుంచి ఏపీలో కర్ప్యూ సడలింపుతో పాటు అటు తెలంగాణలోనూ కర్ప్యూ ఎత్తివేయడంతో శ్రీశైలానికి భారీగా భక్తులు తరలివచ్చారు. కొవిడ్ లాక్ డౌన్ కారణంగా గత నెలరోజులుగా పాతాళగంగ పుణ్య స్నానాలకు అధికారులు అనుమతి నిరాకరించారు. అలాగే తలనీలాల కళ్యాణకట్ట మూతపడింది. దీంతో మూసివేసిన కళ్యాణకట్టను వెంటనే తెరిపించాలని కళ్యాణకట్ట వద్ద భక్తులు నినాదాలు చేస్తున్నారు.