Pawan Kalyan: జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎప్పుడు వార్తల్లోనే ఉంటారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో రాజకీయ దుమారమే రేగుతోంది. పక్క రాష్ర్టం సీఎం స్టాలిన్ ను పొగుడుతూ ట్వీట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం స్టాలిన్ బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ఆయనను ప్రశంసించడం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీకి మిత్రపక్షంగా ఉంటూ వ్యతిరేకంగా ఉన్న స్టాలిన్ ను ఆకాశానికెత్తడం గమనార్హం.
స్టాలిన్ పరిపాలనలో తనదైన శైలి ప్రదర్శిస్తున్నారు. ప్రతిపక్షాలను సైతం నిందించకుండా వారి సలహాలు, సూచనలు తీసుకుంటూ వారికి సరైన గౌరవం ఇస్తున్నారు. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, పళని స్వామి ఫొటోలతో ఉన్న 65 లక్షల బ్యాగుల పంపిణీకి చర్యలు చేపట్టి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తనతోపాటు తన కుమారుడిని ఎవరైనా ప్రశంసిస్తే వారిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నార. దీంతో తమిళనాట స్టాలిన్ రాజకీయం సంచలనం కలిగిస్తోంది.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సీఎం స్టాలిన్ ను పొగడడం యాదృశ్చికమేమీ కాదు. దేశంలోని అందరు నాయకులకు స్టాలిన్ మార్గదర్శకమని సూచిస్తున్నారు. ఆయన పరిపాలనకు ఫిదా అయిపోయి ఆయనపై ప్రశంసల వర్షం కురపించారు. స్టాలిన్ పనితనాన్ని కీర్తించారు. కానీ పవన్ కళ్యాణ్ బీజేపీ వ్యతిరేకంగా ఉన్న స్టాలిన్ పై పొగడ్తలు చేయడంపై అందరిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తెలుగు స్టేట్ల సీఎంలను మాత్రం ఏమి అనలేదు. కులాల వారీగా ఓట్లు కూడగడుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సామాజికవర్గాలను సైతం టార్గెట్ చేస్తున్నాయని పార్టీల వైఖరిపై అనుమానాలు వ్యక్తం చేశారు. బీజేపీతో మిత్రపక్షంగా ఉంటూ పక్క రాష్ర్టం ముఖ్యమంత్రిపై ప్రశంసలు చేయడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ జనసేన మధ్య సంబంధాలు ఉన్నాయా లేదా అని ప్రశ్నలు వస్తున్నాయి.
రాజకీయాలు విచిత్ర మలుపులు తిరుగుతున్నాయి. రోజుకో విధంగా మారుతున్నాయి. మిత్ర పక్షంగా ఉంటూ కూడా ప్రతిపక్ష పార్టీల నాయకుల వైపు మాట్లాడడం వెనుక వారి మైత్రి ఏమైందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసలు బీజేపీ, జనసేన మద్య పొత్తు ఉందా? లేదా అనే సంశయాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ మాటలు ఆలోచించేవిగా ఉన్నాయి. దీనిపై పార్టీల్లో కూడా చర్చ సాగుతోంది. ఏది ఏమైనా జనసేన స్థితిపై బీజేపీ నేతల్లో కూడా పలు సందేహాలు వస్తున్నాయి.