
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఈరోజు కాంగ్రెస్ సేవా దళ్ ప్రధాన కార్యదర్శి శ్రీమతి కూచి లక్ష్మి సోము వీర్రాజు సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తుందని తెలిపారు. కేంద్ర మంత్రి మండలిలో 11 మంది మహిళలకు స్థానం కల్పించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు కుమార్ రాజు, ప్రధాన కార్యదర్శి మాధవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని తదితరులు పాల్గొన్నారు.