Delhi temple threat : ఢిల్లీలోని చాందినీచౌక్ మెట్రో స్టేషన్ వద్ద పది పిల్లర్లపై పోస్టర్లు వెలిశాయి. వీటిని మొదట ఎరవూ పట్టించుకోలేదు. కానీ మెట్రో భద్రతా సిబ్బంది గమనించారు. ఎర్రకెట వద్ద ఉన్న మందిరాలను పేచ్చేస్తామని హెచ్చకించారు. వెంటనే మెట్రో పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించి ఇద్దరిని గుర్తించారు. స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం ఇచ్చారు. వారి కోసం గాలింపు మొదల పెట్టారు. వీరు పశ్చిమ బెంగాల్‌లో పట్టుబడ్డారు.
తీగ లాగితే..
పది మెట్రో పిల్లర్లపై ఎర్రకోట సమీప మందిరాలపై దాడి హెచ్చరికలు అంటించిన వీరిని సీసీటీవీ ద్వారా గుర్తించారు. పశ్చిమ బెంగాల్‌లో పట్టుకున్న ఉమర్ ఫారూఖ్ (మాల్దా స్థిరికుడు), రబూల్ ఇస్లాం (బంగ్లాదేశీ) ప్రశ్నల్లో బంగ్లాదేశ్ ఆధారిత హ్యాండ్లర్ షబీర్ అహ్మద్ లోన్ ఆదేశాలు అని చెప్పారు. ఈ లష్కర్ ఉగ్రవాది పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేస్తూ ఢిల్లీలో పేలుళ్లు ప్లాన్ చేశాడు.
విస్తృత కుట్ర ప్లాన్..
బంగ్లాదేశ్‌లోని ఒక హాండ్లర్ ఆదేశాల మేరకు పనిచేశామని చెప్పారు. ఆహాండ్లర్ పేరు షబీర్ అహ్మద్ లోన్. అంటే కశ్మీరీ ముస్లిం అన్నమాట. కశ్మీర్‌లో ఉగ్రవాదానికి పాల్పడి 2007లో అరెస్ట్ అయి. బెయిల్‌పై బయటకు వచ్చి పాకిస్తాన్ పారిపోయాడు. పాకిస్తాన్‌లో లష్కర్ ఎ తోయిబాతో కలిసి పనిచేస్తున్నాడు. ఇటీవల బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లోని ఇస్లామిక్ సంఘాలకు సంబంధాలు పెరిగాయి. ఈ సబీర్ అహ్మద్ లోన్ బంగ్లాదేశ్ వెళ్లాడు. అక్కడి నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నాడు. తమ మిత్రులు ఢిల్లీలో పేలుళ్లు జరుపబోతున్నట్లు వెల్లడించారు.
గార్మెంట్స్‌లో కార్మికులుగా..
తమిళనాడు తిరుప్పూర్‌లో గార్మెంట్స్ కార్మికులుగా ఉన్న ఏడుగురు మహ్మద్ లీటర్, ఉజ్జల్, జాహిద్, జాహిదుల్ ఇస్లాం, రహమాన్, ఉమర్, ఉమర్ ఫారూఖ్‌అరెస్ట్ అయ్యారు. వీరి ఫేక్ ఆధార్ కార్డులు, 16 సిమ్‌కార్డులు, నకిలీ డాక్యుమెంట్లు సేకరించారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, అస్సాంలో ఫేక్ ఐడీల ఫ్యాక్టరీలు గుర్తించబడ్డాయి, రోహింగ్యాలకు పాస్‌పోర్టులు కూడా అందించారు.
కశ్మీర్ నుంచి బంగ్లాదేశ్ వరకు..
కశ్మీర్ మూలాల ఉగ్రవాది పాకిస్తాన్–బంగ్లాదేశ్ లింక్‌ల ద్వారా దక్షిణ భారతానికి వ్యాప్తి చేసిన ఈ నెట్‌వర్క్ దేశ భద్రతకు సవాలుగా మారింది. బంగ్లాదేశ్ కూలీలు, కార్మికుల రూపంలో దాగి కుట్రలు రచిస్తున్నారు. 2022 దర్భంగా రైల్వే పేలుడు లాంటి సంఘటనలు ఈ ప్యాటర్న్‌ను గుర్తుచేస్తున్నాయి. ఇటీవల ఆసిమ్ మునీర్ కూడా ఈ ప్రకటన చేశారు. తూర్పు నుంచి దాడికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కుట్రతో అది బట్టబయలైంది. అక్రమంగా దేశంలోకి ప్రవేశించి ఇక్కడ పనిచేస్తూ కుట్రలు చేస్తున్నారు. తెలియక కొందరు తెలిసి కొందరు కుట్రలో భాగమయ్యారు.
పోలీసు వేగప్రతిస్పందన దాడులను అడ్డుకుంది, కానీ అక్రమ వలసలు, ఫేక్ డాక్యుమెంట్ల సమస్యలు లోతుగా ఉన్నాయి. తీవ్రమైన వెరిఫికేషన్, అంతార్జాతీయ సహకారం అవసరం. ఈ ఎకోసిస్టమ్‌ను ధ్వస్తం చేయాలంటే బహుళ శాఖల సమన్వయం తప్పనిసరి.