
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశంలోని అన్ని సంస్థల యొక్క సేవలు ఆగిపోగా… కరోనా కారణంగా ఆర్ధికంగా దెబ్బతిన్న వ్యవస్థను గాడిన పెట్టడానికి నిబంధనలను ప్రభుత్వం సడలిస్తూ వస్తుంది. దీనిలో భాగంగా యూపీఎస్సీ పరీక్షల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ మెట్రో యూపీఎస్సీ అభ్యర్థుల కోసం అక్టోబర్ 4న ఉదయం 6 గంటలకు మెట్రో సేవలను ప్రారంభిస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ శనివారం ట్వీట్ చేసింది.