Parvesh Verma
Delhi assembly election results 2025 : 27 ఏళ్ళ తర్వాత దేశ రాజధాని ఢిల్లో లో బీజేపీ పార్టీ అధికారం లోకి రావడం ఒక సెన్సేషన్ అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన ప్రత్యర్థి పర్వేశ్ వర్మ చేతుల్లో మూడు వేల ఓట్ల మెజారిటీ తో ఓడిపోవడం సంచలనంగా మారింది. ఢిల్లీ లో చాలా టఫ్ ఎలక్షన్ ఉంటుందని, కాస్త ఎడ్జ్ తో బీజేపీ పార్టీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు తెలిపాయి. కానీ ఇలా జనాలు ఇలా ఏకపక్ష తీర్పు ఇస్తారని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. సుమారుగా 40 నుండి 50 స్థానాల్లో బీజేపీ పార్టీ గెలవబోతుంది. రెండు సార్లు అధికారం చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 20 స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతుంది. కొన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు అరవింద్ కేజ్రీవాల్ ఈసారి తన స్థానంలో గెలవడం కష్టమే అని చెప్పుకొచ్చారు. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు సరిగ్గా అదే జరగడం విశేషం.
గడిచిన ఐదు సంవత్సరాలలో అనేక అవినీతి ఆరోపణలు ఎదురుకోవడం, అరవింద్ కేజ్రీవాల్ సైతం జైలుకి వెళ్లడం, ఢిల్లీ లో ప్రధాన సమస్యగా పిలవబడే కాలుష్యం విషయం లో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, ప్రజాదనంతో శేష్ మహల్ లాంటి విలాసవంతమైన భవనం ని కట్టుకొని అందులో నివసించడం, ఇలా ఒక్కటా రెండా ఎన్నో ఆరోపణలు, అక్రమాల కారణంగా విసుగెత్తిపోయిన ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ ని తరిమికొట్టడమే కాకుండా, అరవింద్ కేజ్రీవాల్ ని సైతం ఓడించారు. దీంతో ఇప్పుడు బీజేపీ పార్టీ తరుపున ముఖ్యమంత్రి ఎవరు అవ్వబోతున్నారు అనే అంశంపై కూడా దాదాపుగా సస్పెన్స్ వీడినట్టే అని అంటున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ని చిత్తుచిత్తుగా ఓడించిన పర్వేశ్ వర్మ నే ముఖ్యమంత్రి ని చేయబోతున్నట్టు సమాచారం. కాసేపటి క్రితమే పర్వేశ్ వర్మ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ని కలిసి ఈ అంశం పై చర్చించాడు.
అమిత్ షా కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. నేడు సాయంత్రం లేదా, రేపటి లోపు అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండు మూడు రోజుల్లో ప్రమాణస్వీకారం కార్యక్రమం చేయబోతున్నారు. ఇప్పటికే హర్యానా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో అధికారం ని దక్కించుకొని సంచలనం సృష్టించిన బీజేపీ పార్టీ, ఇప్పుడు దేశ రాజధాని లో కూడా జెండా పాతడాన్ని చూస్తుంటే దేశవ్యాప్తంగా బీజేపీ గాలి ఎలా వీస్తుందో అర్థం చేసుకోవచ్చు. రెండు సార్లు కేంద్రం లో అధికారాన్ని దక్కించుకొని మూడవ సారి అధికారం లోకి వచ్చిన తర్వాత కూడా బీజేపీ గాలి ఈ రేంజ్ లో వేయడమంటే, ప్రధాని మోడీ పై దేశప్రజల్లో ఎలాంటి నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. పన్నుల విషయం లో ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయం కూడా బీజేపీ కి ఢిల్లీ లో అధికారం దక్కేలా చేసిందని అంటున్నారు విశ్లేషకులు.