
ఇండియన్ ఆర్చర్, వరల్డ్ నంబర్ వన్ దీపికా కుమారి వ్యక్తిగత రికర్వ్ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. కొరియా ఆర్చర్ ఆన్ సాన్ తో జరిగిన క్వార్టర్స్ లో 0-6 తో దీపికా పరాజయం పాలైంది. మూడు సెట్లలోనూ దీపికపై ప్రత్యర్థి పైచేయి సాధించింది. దీపికా కుమారి మూడు సెట్లలో 27,24,24, స్కోరు చేయగా ఆన్ సాన్ 30,26,26, స్కోరు చేసి సులువుగా గెలిచింది. ఈ ఓటమితో ఒలింపిక్స్ లో మెడల్ గెలిచే అవకాశాన్ని దీపిక కోల్పోయింది. వరుసగా మూడు మ్యాచ్ లు గెలిచి మెడల్ పై ఆశలు రేపిన దీపికా క్వార్టర్ ఫైనల్ తోనే ఇంటిదారి పట్టింది.