
ఆర్చరీ వ్యక్తిగత విభాగంతో దిపికా దూసుకెళ్తోంది. శుక్రవారం ఉదయం జరిగిన ఫ్రిక్వార్టర్స్ లో రష్యా ఆర్చర్ కేనియా పెరోవాపై 6-5 తేడాతో విజయం సాధించింది. ఐదు సెట్లు ముగిసే సరికి ఇద్దరు ఆర్చర్లు 5-5 స్కోరుతో సమంగా నిలవడంతో షూట్ ఆఫ్ లో ఫలితం తేల్చాల్సి వచ్చింది. 28 స్కోరుతో తొలి, మూడో సెట్ లను దీపికా గెలిచింది. నాలుగో సెట్ లో ఇద్దరు స్కోర్లు సమం కాగా.. రెండు ఐదో సెట్ లను రష్యా ఆర్చర్ సొంతం చేసుకుంది. దీంతో ఇద్దరూ ఐదేసి పాయింట్లతో సమనంగా నిలిచారు. అయితే కీలకమైన ఘాట్ ఆఫ్ లో దీపికా పర్ఫెక్ట్ 10 స్కోరు చేయగా ప్రత్యర్థి 7 మాత్రమే చేయగలిగింది. దీంతో దీపికా క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టింది.