
దేశంలో కరోనా కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 11,81,212 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 32,937 మందికి పాజిటివ్ గా తేలింది. ముందురోజు కంటే కేసులు 8.7 శాతం మేర తగ్గాయి. నిన్న మరో 417 మంది మరణించారు. దాంతో మొత్తం కేసులు 3.22 కోట్లకు చేరాయి. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,31,642గా ఉంది. అయితే నిర్ధారణ పరీక్షలు తగ్గడం కూడా కేసుల సంఖ్యలో క్షీణతకు కారణంగా కనిపిస్తోంది. ఇక నిన్న 35,909 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.