
దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు అదుపులోనే ఉంటున్నాయి. మరణాలు కూడా తగ్గుముఖం పట్టడం ఊరట కలిగిస్తోంది. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం 62,480 మందికి వైరస్ పాజిటివ్ గా తేలింది. దాంతో మొత్తం కేసులు 2.97 కోట్లకు పైడ్డాయి. గత 24 గంటల వ్యవధిలో 1,587 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 3,83,490 మంది మహమ్మారికి బలయ్యారు. గురువారం 19,29,476 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.