
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 1,175 మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ కాగా 10 మంది మరణించారు. తాజాగా కరోనా నుంచి మరో 1,771 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 16,640 కొవిడ్ యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే 1,24,907 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.