
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,00632 కరోనా పరీక్షలు నిర్వహించగా 704 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులు 6,31,218కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో ఐదుగురు బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,725కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,724 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.