
తెలంగాణలో కొత్తగా 993 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనా బారిన పడిన వారి సంఖ్య 6,21,606కు చేరింది. గత 24 గంటల్లో కరోనాతో పోరాడుతూ 9మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3644కు చేరింది. తాజాగా 1417మంది కరోనా నుంచి కోలుకోగా ప్రస్తుతం రాష్ట్రంలో 13,869 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.