
ఏపీలో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 5,674 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈరోజు నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో 18,44,917 కి కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లలో కరోనాతో 45 మంది మరణించారు. ఇప్పటి వరకు కరోనాతో 12,269 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 65,244 యాక్టివ్ కేసులున్నాయి.