
ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1433 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 1815 మంది కోలుకున్నారు. ఇన్ఫెక్షన్ కారణంగా మరో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇవాల మొత్తం కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 19,97,102కు పెరిగింది. వీరిలో మొత్తం 19,67,472 మంది కోలుకున్నారు. ఇంకా 15,944 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం మరణాలు 13,686 కు చేరాయి.