
ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,628 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని రాష్ట్ర, వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,41,724కు పెరిగాయి. తాజాగా 2,744 మంది బాధితులు కోలుకోగా ఇప్పటి వరకు 19,5000 మంది డిశ్చార్జి అయ్యారు. వైరస్ ప్రభావంతో 22 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 23,570 యాక్టివ్ కేసులున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.