
ఏపీలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల్లో 71,758 నమూనాలను పరీక్షించగా 2,224 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. తాజాగా మరో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ సోమవారం సాయంత్రం బులెటిన్ విడుదల చేసింది. కరోనా నుంచి నిన్న 4,714 మంది కోలుకోగా రాష్ట్రంలో ప్రస్తుతం 42,252 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.