
ఏపీలో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 88,622 పరీక్షలు నిర్వహించగా 4,981 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 18,67,017 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 38 మంది మరణించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 12,490కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,14,49,636 నమూనాలకు ఆరోగ్య శాఖ పరీక్షించింది.