Telugu Film Industry : ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో కామెడీ సినిమాలను తీయడానికి సపరేట్ గా చాలామంది దర్శకులు ఉండేవారు. కొంతమంది కమర్షియల్ మాస్ సినిమాలను తీస్తే, మరి కొంతమంది మాత్రం కామెడీ సినిమాలనే చేసి సూపర్ సక్సెస్ లను సాధించేవారు. ఇక అందులో జంధ్యాల, ఎస్ వి కృష్ణారెడ్డి, ఇవివి సత్యనారాయణ లాంటి వారు ఉండడం విశేషం…చిన్నపాటి సెంటిమెంటల్ సీన్స్ ను వాడుకుంటూ దానికి కామెడీని జోడించి సూపర్ హిట్లను సాధించారు. ఇక ఇలాంటి క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ సినిమాలు రావడం లేదు. ఎంతసేపు భారీ ఎలివేషన్స్ తో ఉండే సినిమాలే తీస్తున్నారు. ఇక అవి కాకపోతే భారీ బడ్జెట్ తో గ్రాఫిక్స్ ని వాడుకుంటూ సినిమాని చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కామెడీ సినిమాలు మాత్రం రావడం లేదు. అనిల్ రావిపూడి కామెడీ సినిమాలు చేస్తున్నప్పటికి అది క్రింజు కామెడీ అంటూ చాలామంది అతని మీద కామెంట్లు చేస్తున్నారు..అలా కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కామెడీ సినిమాలను చేసే దర్శకులు లేరా? ఇక మనం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ సినిమాలను చూడలేమా అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి.
అనుదీప్ కేవీ లాంటి దర్శకుడు కామెడీ సినిమాలను చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికి ఆయన సినిమాల్లోని పంచులు ఔట్ డేటెడ్ అయిపోయాయి అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. సిచువేషనల్ కామెడీని తెరకెక్కించగలిగే దర్శకుడు ఈ మధ్యకాలంలో ఎవరు లేరు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
కొత్త దర్శకులు ఎవరైనా వచ్చి మంచి కామెడీ సినిమాలను చేసి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తారా? లేదంటే ఇప్పుడున్న దర్శకులే కామెడీ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తారా అనేది తెలియాల్సి ఉంది… నిజానికి ఎంత భారీ బడ్జెట్ సినిమాలు తీసిన కూడా కామెడీ సినిమాలను చూడటానికి సపరేట్ ఆడియన్స్ ఉంటారు. వాళ్ళు కామెడీ సినిమా వచ్చిన ప్రతిసారి చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒకప్పుడు రాజేంద్రప్రసాద్, ఆ తర్వాత అల్లరి నరేష్ లాంటి హీరోలు కామెడీ సినిమాలు చేసేవారు.
ఆ తర్వాత చాలామంది కమెడియన్స్ హీరోలుగా మారి కామెడీ సినిమాలను ట్రై చేసినప్పటికి అవి ఎవరికి సెట్ అవ్వడం లేదు. ఇక దానికి తోడుగా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే జబర్దస్తూ లాంటి కామెడీ షోలు రావడంతో సినిమాల్లో కామెడీ తగ్గింది. షో ద్వారా బూతు కామెడీని చేస్తున్నారు. మరి జెన్యూన్ కామెడీ చేసే దర్శకుడు, హీరోలు ఇండస్ట్రీలో లేరా అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి.