సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను నిర్వహించాలా లేదా రద్దు చేయాలా అన్న అంశంపై నిర్ణయం తీసుకునేందుకు రెండు రోజుల గడువు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా పరీక్షలను ఎందుకు రద్దు చేయకూడదని న్యాయస్థానం కేంద్రాన్ని ప్రశ్నించింది.