
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ఎప్పుడూ ఏదో ఒక హీరో సినిమాకు సంబంధించిన వీడియోలతో తన ముఖాన్ని స్వాపింగ్ చేస్తూ ఆకట్టుకునే వార్నర్ ఈసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ను అనుకరించాడు. వినయ విధేయ రామ సినిమాలోని ఫైటింగ్ వీడియో క్లిప్పింగ్ కు తన ముఖాన్ని జోడించి అద్భుతంగా తీర్చిదిద్దాడు. అందులో చెర్రీలా ఫైటింగ్, డైలాగులు చెప్పి అభిమానులకు కనులవిందు చేశాడు. దాన్ని శనివారం ఇన్ స్టాగ్రామ్ లో పంచుకోవడంతో తెగ లైకులు, కామెంట్లు వస్తున్నాయి.