
దళిత బంధు పథకాన్ని ఒక ఉద్యమంలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఫైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ లో దళితబంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ భాగాల్లో ఉన్న, దళిత శాసన సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లోని 4 మండలాలను ఎంపిక చేసి ఆ మండలాల్లో అన్ని కుటుంబాలకు దళితబంధును అమలు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. చింతకాని మండలం , ఖమ్మం జిల్లా.. తిరుమలగిరి మండలం, (సూర్యాపేట జిల్లా) చారగొండ మండలం ( నాగర్ కర్నూల్ జిల్లా) నిజాం సాగర్ మండలం (కామారెడ్డి జిల్లా) లో దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం వర్తంపచేస్తోంది.