
సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామాల్లో అభివృద్ధి శూన్యమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీఎం దత్తత తీసుకున్న మూడు చింతలపల్లిలో త్వరలో దళిత, గిరిజన దీక్ష చేపడతామని.. ఆ గ్రామం దుస్థితిని మీడియాకు చూపిస్తామన్నారు. గాంధీభవన్ లో రేవంత్ మీడియాతో మాట్లాడారు. ఈటల రాజేందర్ అవినీతిపై కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. తెరాస, భాజపావి కొనుగోలు రాజకీయాలన్నారు. ఎస్సీలకు ఇచ్చిన హామీని కేసీఆర్ అమలు చేయలేదని ఎస్సీలకు ఆయన ఎంత సేవ చేసినా తక్కువేనని చెప్పారు.