
ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలు మోసానికి గురవుతున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడురులో పోలీసు కస్టడీలో మరియమ్మ అనే ఎస్సీ మహిళ మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. దళిత ఆదేదన దీక్ష పేరుతో హైదరాబాద్ లోని గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతలు కార్యక్రమం నిర్వహించారు.