spot_img
Homeఎంటర్టైన్మెంట్Dacoit movie collections : భారీగా పడిపోయిన 'డెకాయిట్' వసూళ్లు.. ఇలా అయితే బ్రేక్ ఈవెన్...

Dacoit movie collections : భారీగా పడిపోయిన ‘డెకాయిట్’ వసూళ్లు.. ఇలా అయితే బ్రేక్ ఈవెన్ అందుకోవడం అసాధ్యం..

Dacoit movie collections : అడివి శేష్(Adivi Sesh) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘డెకాయిట్'(Dacoit Movie) భారీ అంచనాల నడుమ విడుదలై, ప్రేక్షకుల నుండి డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్నప్పటికీ, బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టడం తో , కచ్చితంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుంది , అడివి శేష్ కెరీర్ లో మరో భారీ హిట్ అని అంతా అనుకున్నారు. మొదటి 5 రోజులు ఈ చిత్రానికి అద్భుతమైన వసూళ్లు నమోదైన విషయం వాస్తవమే కానీ, 6 వ రోజున మాత్రం వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ఉదాహరణకు నిన్న బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 5 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయేవి. కానీ నేడు ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో గంటకు కేవలం వెయ్యి టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోతున్నాయి

నిన్న అంబెడ్కర్ జయంతి, సెలవు దినం కావడంతో ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. కానీ నేడు నుండి ఆ రేంజ్ గ్రాస్ నమోదు అయ్యే అవకాశాలు లేవని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇకపోతే ఈ చిత్రానికి 5 రోజులకు కలిపి తెలుగు రాష్ట్రాల నుండి 10 కోట్ల 50 లక్షల రూపాయిలు, ఓవరాల్ గా 21 కోట్ల 28 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని క్లీన్ హిట్ స్టేటస్ కి చేరుకోవాలంటే 31 కోట్ల రూపాయిల వసూళ్లను రాబట్టాలి. అంటే మరో 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు అన్నమాట. అంటే వర్కింగ్ డేస్ లో డీసెంట్ స్థాయి హోల్డ్ ని కనబర్చడం అవసరం. కానీ ఈ చిత్రం నేడు భారీ డ్రాప్స్ ని సొంతం చేసుకోవడంతో ఇప్పుడు బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుందా లేదా అనే అనుమానం ట్రేడ్ వర్గాల్లో కలుగుతోంది.

ఇక ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం నుండి 5 కోట్ల 96 లక్షలు, సీడెడ్ ప్రాంతం నుండి 81 లక్షలు, ఆంధ్ర ప్రదేశ్ నుండి 3 కోట్ల 74 లక్షలు షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 2 కోట్ల 17 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , హిందీ వెర్షన్ నుండి 3 కోట్ల 15 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ నుండి అయితే ఈ చిత్రానికి ఏకంగా 5 కోట్ల 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా 43 కోట్ల రూపాయిల గ్రాస్ , 21 కోట్ల 28 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో ఎంత వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version