spot_img
Homeఎంటర్టైన్మెంట్Srinivasa Mangapuram teaser : మహేష్ బాబు అన్న కొడుకు నటించిన 'శ్రీనివాస మంగాపురం' టీజర్...

Srinivasa Mangapuram teaser : మహేష్ బాబు అన్న కొడుకు నటించిన ‘శ్రీనివాస మంగాపురం’ టీజర్ వచ్చేసింది.. ఇలా ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram teaser : సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుండి మూడవ తరం వారసుడిగా , రమేష్ బాబు తనయుడు జయ కృష్ణ(Jaya Krishna) ఇండస్ట్రీ లోకి హీరో గా అడుగుపెడుతూ ‘శ్రీనివాస మంగాపురం'(Srinivasa Mangapuram) అనే చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి ‘RX100’ దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తుండగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా తాండన్ కూతురు రాశా తాండన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈమెకు కూడా ఇదే తొలిచిత్రం. ఈమె గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ ద్వారా మన టాలీవుడ్ కి పరిచయం కావాల్సింది. ఫోటో షూట్ కూడా చేశారు , కానీ చివరి నిమిషం లో ఈమెకు బదులుగా జాన్వీ కపూర్ ని తీసుకున్నారు. అయితే నేడు ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేశారు మేకర్స్. మరి ఈ టీజర్ అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఉందా?, ఘట్టమనేని కుటుంబం నుండి మూడవ తరం హీరోగా జయ కృష్ణ సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది చూద్దాం.

ముందుగా టీజర్ ని చూస్తుంటే అజయ్ భూపతి మార్క్ లవ్ స్టోరీ అని స్పష్టంగా అర్థం అవుతోంది. కానీ ఇలాంటి లవ్ స్టోరీలను గతంలో మనం చాలానే చూశామే, హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు, కానీ హీరోయిన్ తండ్రి పెళ్ళికి ఒప్పుకోడు, ఇలాంటి కాన్సెప్ట్ తోనే ఈ చిత్రం తెరకెక్కినట్టుగా అనిపించింది. ఇప్పటి వరకు అజయ్ భూపతి తెరకెక్కించిన సినిమాల్లో స్టోరీ, ప్లాట్ చాలా కొత్తగా ఉండేది. కానీ ఈ సినిమాలో ఎందుకో అది మిస్ అయ్యినట్టుగా అనిపిస్తోంది. ఇక జయ కృష్ణ విషయానికి వస్తే , కుర్రాడు ఈ చిత్రం లో బాగా కస్టపడి నటించినట్టుగా ఉన్నాడు. కానీ లుక్స్ మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. ఎక్స్ ప్రెషన్స్ పెడుతున్నాడు కానీ, అవి చూసే ఆడియన్స్ కి ఏదోలా అనిపిస్తోంది.

చాలా చిన్న వయస్సులోనే ఇండస్ట్రీ లోకి వచ్చాడు, కాస్త సమయం తీసుకొని ఎంట్రీ ఇచ్చి ఉండుంటే బాగుండేది అనిపిస్తోంది. ఇక హీరోయిన్ రాశా తాండాని మాత్రం చూసేందుకు చాలా చక్కగా ఉంది, మంచిగా నటించినట్టుగా కూడా అనిపించింది. ఇక ఈ చిత్రం లో సీనియర్ హీరో మోహన్ బాబు కీలక పాత్ర పోషించాడు. టీజర్ మొత్తం మీద హైలైట్ అంశం ఏదైనా ఉందా అంటే, చివర్లో మోహన్ బాబు ఇచ్చిన బ్లాస్టింగ్ ఎంట్రీ నే. ఆయన క్యారెక్టర్ ని పర్ఫెక్ట్ గా వాడుకొని ఉంటే, సినిమాకు పెద్ద ప్లస్ అవ్వుద్ది అనే చెప్పాలి. ఓవరాల్ గా ఈ టీజర్ అయితే ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో అలరించలేదు. ఇంకా కాస్త బెటర్ గా ఉండుంటే బాగుండేది అనిపించింది. మరి మీకు కూడా అలాగే అనిపించిందా?, లేదా బాగా నచ్చిందా అనేది కామెంట్స్ రూపం లో తెలియజేయండి.

#SrinivasaMangapuram Teaser | Jayakrishna Ghattamaneni | Rasha Thadani | Mohan Babu | Ajay Bhupathi

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version