
ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. వ్యాక్సినేషన్ పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ రాయాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వ్యాక్సిన్ డోసులను రాష్ట్రానికి త్వరగా కేటాయించాలని ప్రధానిని సీఎం కోరనున్నారు. 45 ఏళ్లు పై బడ్డ వారికి వ్యాక్సినేషన్ లో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఆక్సిజన్ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. కర్ణాటక, ఒడిశా, తమిళనాడు నుంచి ఆక్సిజన్ తెప్పించేందుకు చర్యలు చేపట్టారు.