
సిటీస్కాన్, బయోమేకర్స్ దుర్వినియోగం అవుతున్నాయని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా అన్నారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తేలికపాటి లక్షణాలు ఉన్నాప్పడు సిటీ స్కాన్ చేసుకున్నప్పటీకి ఎలాంటి ఉపయోగం ఉండదని అన్నారు. ఒక్క సిటీ స్కాన్ 300 చాతి ఎక్స్ రేలకతో సమానమని, ఇది చాలా ప్రమాదకరమని కూడా హెచ్చరించారు. ఆరోగ్యం పై ఆందోళనతో ఇలాంటివన్నీ చేస్తుంటారని, అలాంటి వారు జాగ్రత్తగా ఉండాలని రణ్ దీప్ గులేరియా అన్నారు.