
ఇండియన్ క్రికెటర్ పియూష్ చావ్లా తండ్రి కరోనాతో బాధపడుతూ సోమవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా చావ్లానే వెల్లడించాడు. బరువెక్కిన హృదయంతో ఈ విషయాన్ని చెబుతున్నాను. నా తండ్రి ప్రమోద్ కుమార్ చావ్లా మే 10వ తేదీన మరణించారు. ఆయన కొవిడ్ తో బాధపడుతున్నారు. అని చావ్లా ఇన్ స్టా లో పోస్ట్ చేశాడు. ఇది చూసి చావ్లా తండ్రికి ట్విటర్ లో నివాళులర్పించాడు మాజీ క్రెకెటర్ ఇర్పాన్ పఠాన్. మొన్న అర్ధంతరంగా ముగిసిన ఐపీఎల్ లో పియూస్ చావ్లా ముంబై ఇండియన్స్ తరుపున ఆడాడు.