క్రికెట్ దిగ్గజం డీన్ జోన్స్ కన్నుమూత

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ , వ్యాఖ్యాత డీన్ జోన్స్ (59) కన్నుమూశారు. యూ ఏఈ లో జరుగుతున్న మెగా టీ 20 క్రికెట్ లీగ్ లో స్టార్ స్పోర్ట్స్ తరుపున వ్యాఖ్యాతగా కొనసాగుతున్న ఆయన ప్రస్తుతం ముంబయిలోని ఓహోటల్లో బస చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్ది సేపటి క్రితం ఆయనకు గుండెపోటు రావడంతో తుుదిశ్వాస విడిచారు. మెల్ బోర్న్ లో పుట్టి పెరిగిన డీన్ జోన్స్ ఆస్టేలియా తరుపున 52 టెస్టులు ఆడగా 46.55 సగటుతో 3,631 […]

Written By: NARESH, Updated On : September 24, 2020 5:50 pm
Follow us on

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ , వ్యాఖ్యాత డీన్ జోన్స్ (59) కన్నుమూశారు. యూ ఏఈ లో జరుగుతున్న మెగా టీ 20 క్రికెట్ లీగ్ లో స్టార్ స్పోర్ట్స్ తరుపున వ్యాఖ్యాతగా కొనసాగుతున్న ఆయన ప్రస్తుతం ముంబయిలోని ఓహోటల్లో బస చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్ది సేపటి క్రితం ఆయనకు గుండెపోటు రావడంతో తుుదిశ్వాస విడిచారు. మెల్ బోర్న్ లో పుట్టి పెరిగిన డీన్ జోన్స్ ఆస్టేలియా తరుపున 52 టెస్టులు ఆడగా 46.55 సగటుతో 3,631 పరుగులు చేశారు. అత్యధిక స్కోర్ 216 సాధించగా 11శతకాలు నమోదు చేశారు. ఇక వన్డేలో మ్యాచ్ లు ఆడిన ఆయన 6,068 పరుగులు చేశారు. అందులో 7 శతకాలు, 46 అర్ధశతకాలు ఉన్నాయి.

Also Read: కరోనా తో రైల్వే సహాయ మంత్రి మృతి