Ratan TATA : ప్రముఖ పారిశ్రామిక వేత్త, కార్పొరేట్ దిగ్గజం అయిన రతన్ టాటా బుధవారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణంతో యావత్ దేశం దిగ్భ్రాంతికి లోనైంది. వైద్య పరీక్షల కోసం వెళ్లి ఆయన మరణించడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఇక రతన్ టాటా అంత్యక్రియలను గురువారం(అక్టోబర్ 10న) సాయంత్రం 4 గంటలకు నిర్వహించాలని నిర్ణయించారు. అధికార లాంఛనాలతో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రతన్‌టాటా పార్థీవ దేహాన్ని కడసారి చూసేందుకు నారిమన్ మైదానంలోని ఎన్‌సీపీ ఏ లాన్‌లో ఉంచారు. ఉదయం 10 గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తారు.
అంత్యక్రియలపై భిన్న చర్చ..
ఇక రతన్ టాటా అంత్యక్రియలపై భిన్నమైన చర్చలు జరుగుతున్నాయి. టాటాది పార్సీ కమ్యూనిటీ. కానీ, అంత్యక్రియలు మాత్రం హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహిస్తారని తెలుస్తోంది. ముంబైలోని వర్లీలో విద్యుత్ శ్మశానవాటికలో సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు చేస్తారు. అక్కడ 45 నిమిషాలు ప్రార్థనలు చేస్తారు. తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తారు.
భిన్నంగా పార్సీ అంత్యక్రియల పద్ధతి
ఇదిలా ఉంటే.. పార్టీ కమ్యూనిటీలో అంత్యక్రియల పద్ధతి చాలా భిన్నంగా ఉంటుంది. పార్టీలో అంత్యక్రియల సంప్రదాయం 3 వేల ఏళ్లనాటిది. ఇప్పటికీ దానినే పాటిస్తున్నారు. వేల ఏళ్ల క్రితం పర్షియా(ఇరాన్) నుంచి భారత్‌కు వలస వచ్చింది పార్సీ సమాజం. వీరి సంప్రదాయంలో మృతదేహాన్ని ఖననం చేయరు. జోరాస్ట్రియనిజంలో మరణం తర్వాత శరీరాన్ని రాబంధులు తినడానికి బహిరంగ ప్రదేశంలో ఉంచుతారు. దీనిని టవర్ ఆఫ్ సైలెన్స్ లేదా దఖ్మా అని పిసుస్తారు. రాబంధులు మృతదేహాలను తినడం కూడా పార్సీ సమాజంలో ఓ భాగమే. ఈ నేపథ్యంలోనే రతన్ టాటా అంత్యక్రియలను పార్సీ పద్దతిలో కాకుండా హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించాలని నిర్ణయించారు. 2022లో టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ అంత్యక్రియలు కూడా హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. కరోనా నేపథ్యంలో నాడు మృతదేహాలను దహనం చేసే పద్ధతిలో మార్పులు వచ్చాయి. ఆ సమయంలో పార్టీ సమాజం పాటించే అంత్యక్రియల ఆచారం నిషేధించారు.
పార్సీలు పద్ధతి ఇలా..
ఇదిలా ఉంటే… పార్టీ సమాజంలో అంత్యక్రియలు భిన్నంగా ఉంటాయి. వ్యక్తి మరణించిన తర్వాత మృతదేహాన్ని జనావాసాలకు దూరంగా ఉంటారు. తర్వాత మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేస్తారు. తర్వాత మృతదేహాన్ని అలాగే వదిలేస్తారు. అప్పుడు డేగలు,రాబందులు మృతదేహాన్ని తింటాయి.