
కొవిషీల్ట్ టీకా డోసుల మధ్య విరామం గురించి తాజా అధ్యయనమొకటి కీలక అంశాలను వెల్లడించింది. రెండు డోసుల మధ్య 45 వారాల వ్యవధి ఉంటే.. వ్యక్తుల్లో రోగ నిరోధకత స్పందన మరింత మెరుగ్గా కనిపిస్తున్నట్లు తేల్చింది. ఈ వ్యాక్సిన్ మూడో డోసును కూడా తీసుకుంటే యాంటీబాడీల స్థాయిలు ఇంకా ఎక్కువగా వృద్ధి చెందుతున్నాయని నిర్ధారించింది. భారత్ లో ప్రస్తుతం కోవిషీల్డ్ డోసుల మధ్య విరామాన్ని 12-16 వారాలుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే.