
కరోనా మరణాలకు ముందస్తుగా సిద్ధం చేసిన చితులు సమాజాన్ని తల దించుకునేలా చేస్తున్నాయి. ఈరోజుకు పదికంటే ఎక్కువ శవాలు శ్మశానవాటికలకు వస్తుండటంతో దహన సంస్కారాలు నిర్వహించే కొందరు ప్రయివేటు వ్యక్తులు ముందుగానే చితులు పేర్చి శవాలకు స్వాగతం పలుకుతున్నారు. కరీంనగర్ లోని మానేరు నదీ తీరంలోని శ్మశానవాటికలో ఈ దృశ్యం కనిపించింది. కరోనా రోగులు ఏ ప్రాంతం వారైనా కరీంనగర్ ప్రయివేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణిస్తే వారి కుటుంబీకులు కరీంనగర్ లోనే దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు.