జర్మనీలో 12 ఏళ్లు పైబడిన పిల్లలకు కరోనా వ్యాక్సిన్

దేశంలో మరో నెల రోజుల్లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో 12 ఏండ్లు పైబడిన పిల్లలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయాలని జర్మనీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జూన్ 7వ తేదీ నుంచి కొవిడ్ టీకాలు ఇస్తామని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ వెల్లడించారు. అయితే పిల్లలు కరోనా టీకాలు వేయించుకోవడం తప్పనిసరి కాదని ఆమె స్పష్టం చేశారు. 12 నుంచి 15 ఏళ్ల పిల్లలకు ఫైజర్ లేదా బయోఎంటెక్ కొవిడ్ టీకాలు ఇవ్వడానికి యారోపియన్ […]

Written By: Velishala Suresh, Updated On : May 28, 2021 7:58 am
Follow us on

దేశంలో మరో నెల రోజుల్లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో 12 ఏండ్లు పైబడిన పిల్లలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయాలని జర్మనీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జూన్ 7వ తేదీ నుంచి కొవిడ్ టీకాలు ఇస్తామని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ వెల్లడించారు. అయితే పిల్లలు కరోనా టీకాలు వేయించుకోవడం తప్పనిసరి కాదని ఆమె స్పష్టం చేశారు. 12 నుంచి 15 ఏళ్ల పిల్లలకు ఫైజర్ లేదా బయోఎంటెక్ కొవిడ్ టీకాలు ఇవ్వడానికి యారోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ శుక్రవారం ఆమోదించనుంది.