
కరోనా సోకిన భార్యను ధైర్యానిచ్చి అన్ని విధాలా అండగా నిలవాల్సిన భర్త ఆమె పట్ల పైశాచికంగా ప్రవర్తించాడు. ఆమె ద్వారా తనకు కూడా కరోనా సోకుతుందేమోనన్న భయంతో వారంపాటు ఆమెను బాత్ రూమ్ లో బంధించాడు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో అమానుష ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతే గ్రామానికి చెందిన ఓ వివాహితకు ఇటీవల కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో భర్త ఆమెను బాత్ రూంలో బంధించాడు. వారంపాటు తినేందుకు భోజనం, తాగేందుకు కనీసం తాగునీరు కూా ఇవ్వలేదు. విషయాన్ని గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఈ ఇంటికి చెేరుకుని ఆమెను రక్షించారు.