
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గురువారం 41,195 పాజిటివ్ కేసులునమోదవగా, తాజాగా అవి 40 వేలు రికార్డయ్యాయి. దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 40, 120 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,21,17,826కు చేరింది. ఇందులో 3,13,02,345 మంది బాధితులుకోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 3,85,227 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గురువారం నుంచి ఇప్పటి వరకు 585 మంది మరణించారు.