ఒడిశా మయూర్ భంజ్ లోని ఉడాలా సబ్ జైలులో ఉన్న 21 మంది అండర్ ట్రయల్ ఖైదీలకు కరోనా సోకింది. ఖైదీలకు పరీక్షలు నిర్వహించగా 21 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు అధికారులు తెలిపారు. దీంతో వారిని ఐసోలేషన్ లో ఉంచినట్లు జైలు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విద్యాధర్ దండపత్ పేర్కొన్నారు. అవసరమైన వారిని కొవిడ్ కేర్ సెంటర్ కు తరలించి చికిత్సలు అందించనున్నట్లు పేర్కొన్నారు.