
కరోనా మహమ్మారి కారణంగా పూర్తి స్థాయి విద్యాసంస్థలు తెరుచుకోకున్న అక్కడక్కడా కొన్ని నిభంధనలతో పాక్షికంగా విద్యాసంస్థలు నడుస్తున్నాయి. విజయవాడ లోని గంట్వాడా జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహిస్తున్న తరగతులకు హాజరైన విద్యార్థులకు గత నెల 30న గంట్యాడ ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా 20 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. పాఠశాలలో నిర్వహిస్తున్న తరగతులకు విద్యార్థులు హాజరుకావడం వల్లే కరోనా వచ్చిందని తల్లితండ్రులు భాదపడుతున్నారు.