
భారత్ లో ఉత్పరివర్తనం చెందిన కరోనా B.1.617 వైరస్ రకం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు పాకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇప్పటి వరకు కనీసం 17 దేశాల్లో ఈ కరోనా వైరస్ రకాన్ని గుర్తించినట్లు పేర్కొంది. B.1.617 జంట ఉత్పరివర్తనాల వైరస్ రకం తొలిసారిగా ఇది భారత్ లో బయటపడగా యూకే, సింగపూర్ సహా పలు దేశాల్లో ఈ రకాన్ని గుర్తించినట్లు డబ్ల్యూహెచ్ వో తన వీక్లీ అప్ డేట్ లో తెలిపింది. అయితే ప్రస్తుతానికి ఇది ప్రాణాంతకం అని ప్రకటించలేమని తెలిపింది.