
తెలంగాణ రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని వైద్య ఆరోగ్య సంచాలనకుడు జీ శ్రీనివాస రావు తెలిపారు. శనివారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. భారత్ సహా 135 దేశాల్లో వైరస్ తీవ్రత అధికంగా ఉందని వెల్లడించారు. డెల్టా ఉధృతి కారణంగా అనేక దేశాలు ఇబ్బంది పడుతున్నాయని అన్నారు. మానవ శరీరంపై డెల్టా వైరస్ ప్రభావం ఎక్కువ కాలం ఉంటుందని తెలిపారు. ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థాన్ని ఈ రకం వైరస్ లో గుర్తించామని పేర్కొన్నారు.